ETV Bharat / state

gangula on bandi sanjay : 'బండి సంజయ్‌ది జాగరణ దీక్ష కాదు.. కొవిడ్‌ను వ్యాప్తి చేసే దీక్ష' - మంత్రి గంగుల కమలాకర్​ వార్తలు

gangula on bandi sanjay : గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి బండి సంజయ్‌ ప్రయత్నిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్​ ఆరోపించారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడంపై మంత్రి గంగుల కమలాకర్‌ మీడియాతో మాట్లాడారు.

gangula on bandi sanjay
gangula on bandi sanjay
author img

By

Published : Jan 3, 2022, 12:25 AM IST

gangula on bandi sanjay : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ది జాగరణ దీక్ష కాదని, కొవిడ్‌ను వ్యాప్తి చేసే దీక్ష అని మంత్రి గంగుల కమలాకర్​ విమర్శించారు. ఎవరైనా కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీసుల అనుమతి కూడా లేకుండా దీక్ష చేయొచ్చా అని గంగుల అన్నారు. ఒక ఎంపీ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించారు. దిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం అరెస్ట్‌ చేయాదా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు 317 జీవో ఇచ్చామని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించే బాధ్యత భాజపా నేతలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. కొవిడ్‌ వ్యాప్తి పెరిగితే ఎవరు బాధ్యులు అని అన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కొవిడ్‌ ఆంక్షలు విధించట్లేదా? అని గంగుల ప్రశ్నించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. కరీంనగర్‌ పోలీసులను అభినందిస్తున్నట్లు గంగుల తెలిపారు. సమూహం లేకుండా బండి సంజయ్‌ దీక్ష చేయొచ్చు కదా? అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.