పేద విద్యార్థులకు విద్యను అందించే విధంగా కార్యచరణ రూపొందిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుస్తకాలు, కంప్యూటర్లు కొనలేని స్థితిలో ఉన్న విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని..స్మార్ట్‌సిటీలో భాగంగా జిల్లా గ్రంథాలయాన్ని మరింత ఆధునీకరించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
ఇదీ చదవండిః మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం