ETV Bharat / state

రెమ్​డెసివిర్​ క్రయవిక్రయాలపై త్వరలోనే విజిలెన్స్​ కమిటీ: గంగుల - vigilance committee on remdesivir in karimnagar

కరీంనగర్​ జిల్లాలో రెమ్​డెసివిర్​ ఇంజెక్షన్ల క్రయవిక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్​ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి ఆస్పత్రిలో ఇంజెక్షన్ల వాడకంపై నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

minister gangula kamalakar on remdesivir
రెమ్​డెసివిర్​, గంగుల కమలాకర్​
author img

By

Published : Apr 21, 2021, 6:13 PM IST

కరీంనగర్ జిల్లాలో రెమ్​డెసివిర్‌ ఇంజెక్షన్ల కొనుగోళ్లు, అమ్మకాలపై విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు బీసీ, పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రెమ్​డెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌లో అమ్ముతున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఆస్పత్రులు ఎన్ని ఇంజెక్షన్లు కొనుగోలు చేశాయి.. వాటిని ఎవరికి వినియోగించారనే తదితర అంశాలను సమీక్షించేందుకు కమిటీ ఏకైక మార్గంగా భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా చికిత్స కోసం వచ్చే వారికి ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు మానవతా దృక్పథంతో సేవలందించాలని కోరారు.

అక్రమాలను సహించేది లేదు..

ఇంజెక్షన్లను వాస్తవ ధరలకు విక్రయించాలని వాటిని బ్లాక్‌మార్కెట్‌‌కు తరలిస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. అందుబాటులో రెమ్​డెసివిర్​ లేకపోతే తమను లేదా కలెక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వంతో చర్చించి అవసరమైన మేర సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ అధ్యక్షతన విజిలెన్స్ కమిటీని త్వరలోనే ఏర్పాటు చేస్తామని గంగుల స్పష్టం చేశారు.

రెమ్​డెసివిర్​ క్రయవిక్రయాలపై త్వరలోనే విజిలెన్స్​ కమిటీ: గంగుల

ఇదీ చదవండి: వారంలోగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో రెమ్​డెసివిర్​: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.