ETV Bharat / state

Manair river front project : సబర్మతీ రివర్‌ఫ్రంట్‌కు ధీటుగా మానేరు రివర్ ఫ్రంట్‌ - తెలంగాణ వార్తలు

Manair river front project : గుజరాత్‌ సబర్మతీ రివర్‌ఫ్రంట్‌కు ధీటుగా కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. రూ.410కోట్లతో చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ స్థలాన్ని నీటి పారుదల, ఇంజినీరింగ్‌, పర్యాటక శాఖ అధికారుల బృందం సందర్శించింది.

Manair river front project, gangula kamalakar
సబర్మతీ రివర్‌ఫ్రంట్‌కు ధీటుగా మానేరు రివర్ ఫ్రంట్‌
author img

By

Published : Jan 12, 2022, 10:10 PM IST

Manair river front project : కరీంనగర్‌ను సుందరంగా, పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దిగువ మానేరు డ్యాం గేట్ల కింది భాగంలో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు, పర్యాటక శాఖ అధికారులు, కలెక్టర్‌తో కలిసి మంగళవారం స్థలపరిశీలన చేశారు. దిగువ మానేరు ప్రాజెక్టు గేట్ల వద్ద నుంచి తీగల వంతెన వరకు గల దూరాన్ని అంచనా వేసి ప్రజల ఆహ్లాదం కోసం ఎలాంటి నిర్మాణాలు చేపట్టారనే అంశాలను చర్చించారు.

రూ.410 కోట్లతో నిర్మాణం

కరీంనగర్‌కు ముఖ ద్వారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే క్రమంలో ఏర్పాటు చేసిన కరీంనగర్- వరంగల్ పాత రోడ్డులో తీగల వంతెనను ప్రత్యక్షంగా పరిశీలించారు. మానేర్ రివర్ ఫ్రంట్ డిజైన్ పోస్టర్లను అధికారులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్‌ను మొదటి దశలో 3.75 కిలోమీటర్ల వరకు పూర్తి చేస్తామని, రెండో దశలో 6.25 కిలో మీటర్లు పూర్తి చేస్తామని మంత్రి వివరించారు.

సబర్మతీ రివర్‌ఫ్రంట్‌కు ధీటుగా మానేరు రివర్ ఫ్రంట్‌

'వాటర్ ఫౌంటేన్స్, కల్చరల్ యాక్టివిటీస్ ప్లేస్, స్టీముల ఏరియా, థీమ్ పార్క్స్ వంటివి డిజైన్ చేస్తున్నాం. అందుకు సంబంధించిన భూమిని టూరిజం డిపార్టుమెంట్ అధికారులు పరిశీలించాం. రెండేళ్లలో దీనిని పూర్తి చేస్తాం. వైకుంఠఏకాదశి నాడు టెండర్ వేస్తాం. అతి త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం.'

-గంగుల కమలాకర్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి

ఆనందం.. ఆహ్లాదం..

మానేర్ రివర్ ఫ్రంట్ లో 12 నుంచి 13 అడుగుల లోతు వరకు నీరు నిల్వ ఉంటాయని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్ తెలిపారు. ఇందులో స్పీడ్ బోట్లు, క్రూజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా,ఆహ్లాదాన్ని కలిగిస్తాయని వివరించారు. దిల్లీకి చెందిన ఐఎన్​ఎస్ కన్సల్టెన్సీ... మానేర్ రివర్ ఫ్రంట్ పనులను చేపట్టనుంది.

'నార్త్ తెలంగాణ 147 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ ప్రాజెక్టు ఇప్పటికే డెవలప్ అయింది. దేశంలో ఎక్కడా కూడా లేదు. రైతు సోదరులందరికీ బెనిఫిట్స్ వస్తున్నాయి. కరీంనగర్​కు మకుటంలాగా ఉండే ప్రాజెక్టు నెక్ట్స్ లెవల్​లో రానుంది. ఈ ప్రాజెక్ట్ 3.7కి.మీటర్ కింద ఒక వాటర్ బాడీ క్రియేట్ చేస్తాం. పక్కన ఉండే ప్లేస్​లో కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతాయి.'

-రజత్‌కుమార్‌, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి

'రివర్స్ ఫ్రంట్​లో ఉన్న సమస్యలను పరిశీలిస్తున్నాం. వాటిని పరిష్కరిస్తూ ప్రారంభిస్తాం. తర్వాత కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. గ్రీనరీ, వాటర్ స్పోర్ట్స్ వంటి సౌకర్యాలతో చేస్తున్నాం. నీటిపారుదల, పర్యాటక డిపార్టుమెంట్లు కలిసి దీనికోసం పని చేస్తున్నాయి.'

- మురళీధర్‌రావు, ఇంజినీర్ ఇన్‌ ఛీప్‌

ఇదీ చదవండి: ఎరువుల ధరల పెంపుపై కేసీఆర్ తీవ్ర నిరసన.. ప్రధానికి బహిరంగ లేఖ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.