ETV Bharat / state

'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది' - మంత్రి గంగుల కమలాకర్ వార్తలు

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్​ జిల్లాలో 50లక్షల మొక్కలు నాటుతామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తామంటూ మంత్రి కేటీఆర్​కు మాటిచ్చారు. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి పేర్కొన్నారు.

minister-gangula-kamalakar-about-haritha-haram-in-karimnagar-district
'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది'
author img

By

Published : Jul 8, 2020, 12:45 PM IST

కరీంనగర్​ జిల్లాలోని వెదురుగట్ట గ్రామంలో హరితహారం కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరై మొక్కలు నాటారు. పూర్వం కరీంనగర్​ వనాలకు ప్రసిద్ధి చెందిందని... కానీ గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల జిల్లా వనాలను కోల్పోయిందని మంత్రి గంగుల పేర్కొన్నారు.

''నా చిన్నతనంలో అడవులు ఎక్కువగా ఉండటం వల్ల జిల్లాలో వర్షాలు అధికంగా ఉండేవి. కాలాక్రమేణా ప్రభుత్వాలు మారి... అడవుల సంరక్షణ తగ్గి ఈ ప్రాంతమంతా నిర్జీవమైపోయింది. వర్షపాతం తగ్గింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక... హరితహారం కార్యక్రమం ద్వారా మళ్లీ కరీంనగర్​ పచ్చతోరణంలా కనిపిస్తోంది. ఈ ఆరో విడత హరితహారంలో భాగంగా జిల్లాలో 50లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. పనులు కూడా ప్రారంభించాం. భావితరాలకు ఈ కార్యక్రమం బంగారు బాట అవుతుంది.''

-మంత్రి గంగుల కమలాకర్

'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది'

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి... వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పిల్లలకు వనాలను ఆస్తిగా ఇచ్చి... వారికి మంచి వాతావరణం అందిచేలా కృషి చేయాలన్నారు.

ఇదీ చూడండి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గృహనిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.