రైతుల నుంచి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని.. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చెర్ల బూత్ పూర్ గ్రామంలో ఏర్పాటైన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.. కలెక్టర్ శశాంకతో కలిసి ఆయన ప్రారంభించారు.
కొవిడ్ సంక్షోభం కారణంగా.. దేశ వ్యాప్తంగాఎక్కడా ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. రైతులను.. ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం కాపాడుతూ వస్తోందన్నారు. ధాన్యం విక్రయించిన మూడు రోజులకే అన్నదాతల అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో.. సాగు నీరు సమృద్ధిగా అందుతుండటంతో పంట దిగుబడి రెట్టింపైనట్లు ఆయన వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో.. అందరూ కరోనా నిబంధనలను పాటించాలని కోరారు.
ఇదీ చదవండి: కఠిన ఆంక్షల నడుమ 'మహా'నగరాలు