ETV Bharat / state

Minister Gangula: 'తెరాస విచ్ఛిన్నానికి ఈటల కుట్ర'

మాజీ మంత్రి ఈటలపై మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) విరుచుకు పడ్డారు. ఆస్తుల రక్షణ కోసమే ఈటల భాజపాలో చేరుతున్నారని ఆరోపించారు. రాజేందర్‌.. భాజపా నేతలు అనుకున్నంత అమాయకుడు కాదని అన్నారు.

minister gangula
minister gangula
author img

By

Published : Jun 14, 2021, 8:18 AM IST

తెరాస పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుట్ర పన్నారని మంత్రి గంగుల కమలాకర్‌(Minister Gangula) మండిపడ్డారు. కేసీఆర్ బొమ్మతోనే ఈటల గెలిచారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ నేతలతో కలిసి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి సద్దులు మోసిన వ్యక్తి ఈటల రాజేందర్‌ అని గంగుల(Minister Gangula) ఆరోపించారు. ఆయన.. భాజపా నేతలు అనుకున్నంత అమాయకుడు కాదన్నారు. ఆస్తుల రక్షణ కోసమే కమలం పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. హుజురాబాద్ అభివృద్ది చెందాలంటే తెరాసను మరోసారి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ వీ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యేలు వొడితల సతీష్‌కుమార్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తదితర శ్రేణులు హాజరయ్యారు.

ఇదీ చదవండి: CM KCR: పల్లెలు, పట్టణ ప్రగతే లక్ష్యం.. పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.