కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజవర్గంలోని వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొని పూజలు నిర్వహించారు. స్వామి వారి పల్లకి మోశారు.
వెంకటేశ్వర స్వామి ఆలయం అంటేనే వడ్డి కాసుల వాడని... 80లక్షలు పోగు చేసుకొని ఆలయం నిర్మించుకోవడం గొప్ప విషయమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఎక్కువగా మహిళలు హాజరుకావడం గొప్ప విషయమన్నారు. రోడ్లు వేసే బాధ్యత మాది అని... ఫోర్ లైన్, ఇతర రోడ్లు వేయమని ఎవరూ అడగక ముందే... నియోజక వర్గంలోని ప్రతి మండలంలో ఫోర్ లైన్, సీసీ, బీటీ రోడ్లు వేశామన్నారు. ప్రతి గ్రామానికి స్మశాన వాటికలు, ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఇదీ చూడండి: క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించిన మంత్రి ఎర్రబెల్లి