మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు ఆలయాలను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. హుజూరాబాద్, ఆబాది జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, సిరిసేడు, కనగర్తి, కమలాపూర్, గూనిపర్తి గ్రామాల్లోని శివాలయాలను మంత్రి ఈటల సందర్శించారు. వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి: సర్వం శివమయం.. శివాలయాల్లో భక్తజన సందోహం..