రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
పత్తి నిల్వలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మరో పది రోజుల్లో నాణ్యమైన పత్తి మార్కెట్‌కు వస్తుందని, 90 శాతం పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని ఈటల కోరారు. అకాల వర్షాలకి పంటలు దెబ్బతినటంతో నష్టపోయిన రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని మార్కెట్ యాజమాన్యానికి ఈటల విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్, అదనపు కలెక్టర్, మార్కెటింగ్ శాఖ అధికారులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఝార్ఖండ్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి