కరీంనగర్ నగరపాలక సంస్థలోని 60 డివిజన్లలో పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామని మేయర్ సునీల్ రావు అన్నారు. అందుకు పాలకవర్గం పూర్తిగా సహకరిస్తోందని పేర్కొన్నారు.
నగరంలోని 13వ డివిజన్ రామచంద్రాపూర్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ చొప్పరి జయశ్రీతో కలిసి భూమి పూజ చేశారు. పట్టణ ప్రగతి అనే కార్యక్రమం లేకుంటే అభివృద్ధి లేదన్నారు.
రాబోయే రోజుల్లో కరీంనగర్‌ను మరింత అభివృద్ధి చేసి చూపెడతామని ధీమా వ్యక్తం చేశారు. నగర అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం: కవిత