కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ ఉమ్మెంతల సరోజన అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మూణ్నెళ్లకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖల అధికారులు గైర్హాజరు కావడం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతగా ఉండాల్సిన అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు.
అధికారుల తీరులో మార్పు రాకపోతే ఉన్నతాధికారులకు నివేదించాలని ఎంపీపీని ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.
- ఇదీ చూడండి: 'భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి'