ETV Bharat / state

మాస్కు ధరించమన్నందుకు కత్తితో పొడిచాడు..

కరోనా కారణంగా మాస్కు పెట్టుకోవాలని సలహా ఇచ్చినందుకే వ్యక్తిపై దాడికి దిగాడు మరో వ్యక్తి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో చోటుచేసుకుంది.

man stabbed for the reason of wearing mask
మాస్కు ధరించమన్నందుకు కత్తితో పొడిచాడు..
author img

By

Published : Jul 29, 2020, 4:33 PM IST

కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామంలోని హెయిర్ కటింగ్ సెలూన్‌కు ఆసిఫ్‌ అనే యువకుడు మాస్కు లేకుండా వచ్చాడు. సెలూన్​లో పనిచేస్తున్న రాజశేఖర్... మాస్కు పెట్టుకోవాలని సూచించాడు. కోపోద్రిక్తుడైన ఆసిఫ్... మాస్కు పెట్టుకోకపోతే నీకేంటంటూ గొడవకి దిగాడు. వెంటనే కత్తి తీసుకొని రాజశేఖర్​ నడుముపై దాడి చేశాడు.

తీవ్ర గాయాలపాలైన రాజశేఖర్​ను సెలూన్​ యజమాని ఆస్పత్రికి తరలించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసిఫ్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మాస్కు పెట్టుకోమని సలహా ఇచ్చినందుకే కత్తితో దాడి చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.