కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో ఓ వ్యక్తి కుటుంబసభ్యులతో సెల్‌టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. భూకేటాయింపుల విషయంలో ఉన్న తగాదాలలో తనకెలాంటి సంబంధం లేకున్నా... ఎస్సై పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులు పరిష్కరించాల్సిన భూ సమస్యలో ఓ ఎస్సై ఇలా కక్షపూరితంగా వ్యవహరించటం దారుణమని బాధితుడు వాపోయాడు.
రాస్తారోకో నిర్వహించిన అనంతరం... పక్కనే ఉన్న సెల్‌టవర్ ఎక్కాడు. ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. స్థానికులు, పోలీసులు ఎంత సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. ఎస్సై విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వగా... ఎట్టకేలకు దిగివచ్చాడు. ఏ కారణం లేకుండా తనను కొట్టిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మందలించామే తప్ప... చేయి చేసుకోలేదని ఎస్సై తెలిపారు.
ఇవీ చూడండి: మేడారంలో అపశృతి.. మూర్ఛవ్యాధితో ఇద్దరి దుర్మరణం