ETV Bharat / state

ఈటల అక్రమ కేసులు పెట్టించారని సెల్​టవర్ ఎక్కిన వ్యక్తి - man climbed on to cell tower in huzurabad

మంత్రి ఈటల రాజేందర్ తనపై అక్రమ కేసులు పెట్టించారంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. తనపై పెట్టిన కేసులపై విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​లో చోటుచేసుకుంది.

karimnagar news, allegations on etela, huzurabad news
కరీంనగర్ వార్తలు, ఈటలపై ఆరోపణలు, హుజూరాబాద్ వార్తలు
author img

By

Published : May 1, 2021, 7:14 PM IST

ఈటల రాజేందర్ తనపై అక్రమ కేసులు పెట్టించారంటూ ఓ వ్యక్తి సెల్​ టవర్ ఎక్కాడు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​కు చెందిన తిప్పారపు సంపత్ కొత్తపల్లి సెల్​ టవర్ ఎక్కి హల్​చల్ చేశాడు. అక్రమ ఆస్తులపై ప్రశ్నించినందుకు ఈటల తనతో పాటు తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించాడు. రెండు నెలల పాటు జైలు జీవితాన్ని గడిపానని వాపోయాడు.

ఈటలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని సంపత్ డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై చీనా నాయక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితునితో మాట్లాడి సెల్​టవర్ దిగాలని కోరారు. తనకు న్యాయం జరిగేంత వరకు దిగే ప్రసక్తే లేదని సంపత్ స్పష్టం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.