కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ రాజీవ్ రహదారిపై నిలిచి ఉన్న లారీని మెట్పల్లి డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. 23 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అదే సమయంలో లోడుతో వేగంగా వస్తున్న ఓ లారీ అదుపు తప్పి ముందున్న మరో లారీని ఢీకొట్టి బోల్తాపడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇవీ చూడండి: అమ్మ ఒక మజిలీ కాదు... జీవిత ప్రయాణం