కరీంనగర్‌లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయిన తరుణంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తోంది. అత్యవసర సర్వీసులకు కేవలం ఉదయం 10 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల పగలంతా నిర్మానుష్యంగా మారుతోంది. కరీంనరగ్ జిల్లాలో ప్రస్తుతం 17 మంది కరోనా పాజిటివ్ బాధితులకు చికిత్స పూర్తి కావడం వల్ల వారిని హోం క్వారంటైన్‌కు తరలించారు. మరో ఇద్దరికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు.
కాలనీల్లోనూ.. ప్రత్యేక దృష్టి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోట, కశ్మీర్‌గడ్డ, శర్మనగర్, సాహెత్‌నగర్, హుజూరాబాద్‌లోని పలు ప్రాంతాలను కంటైన్మెంట్‌గా జోన్లుగా కొనసాగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడం వల్ల కంటైన్మెంట్ ప్రాంతం కిందకు చేర్చారు. గోదావరిఖనిలోని జీఎం కాలనీ, అన్నపూర్ణకాలనీతో పాటు కోరుట్లలోని బస్టాండ్ ప్రాంతం కూడా కంటైన్మెంట్ ప్రాంతంగా కొనసాగుతోంది. ప్రధాన రహదారులే కాకుండా కాలనీల్లోనూ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
కఠిన చర్యలు తప్పవు...
కరీంనగర్ మెడికల్ హబ్‌గా మారిన క్రమంలో అత్యవసర సమయాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు అధికంగా ఉంటారని సీపీ పేర్కొన్నారు. ఎవరికి వారు తమ అత్యవసర సర్వీసులని స్టిక్కర్లు అంటించుకొని వాహనాలు నడుపుతున్నారని సీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల పిల్లలు.. తల్లిదండ్రుల వాహనాలు నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాహనాలను సీజ్ చేస్తామని సీపీ హెచ్చరించారు.
ప్రభుత్వం ఏ ఉద్దేశంతో లాక్‌డౌన్ అమలు చేస్తుందో ఆ స్పూర్తిని దెబ్బతీయకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'ఎవరూ ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచొద్దు