ETV Bharat / state

ఫుల్లుగ తాగలే.. పైసలు మాత్రం మస్త్ వచ్చినయ్! - కరీంనగర్​ జిల్లా వార్తలు

దాదాపు రెండు నెలలపాటు లాక్​డౌన్​ కారణంగా మద్యం దుకాణాలు మూసివేయడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడింది. ఈ క్రమంలో నిబంధనలు సడలించి మద్యం అమ్మకాలకు అవకాశం కల్పించారు. తొలిరోజుల్లో కొనుగోలుదారులు భారీగా కనిపించినా... క్రమంగా పూర్తిగా తగ్గిపోయారు. వేసవి కాలంలో అత్యధికంగా అమ్ముడయ్యే బీర్ల అమ్మకం ఈసారి పూర్తిగా తగ్గిపోయింది. ధరలు పెంచడం వల్ల ఖజానా నిండినా.. అమ్మకాల్లో మాత్రం గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది.

lockdown effect on wines sales in karimnagar, telangana state
అమ్మకాలు పడిపోయినా... ఖజానా నిండింది..
author img

By

Published : Jun 6, 2020, 7:01 PM IST

కరోనాను అదుపు చేసేందుకు విధించిన లాక్​డౌన్... అన్ని రంగాలపై ప్రభావం పడింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతతోపాటు రోజూవారి కూలీ పనులు చేసే వారికి పనులు లేకపోవడం వల్ల ఆదాయం దారుణంగా పడిపోయింది. దీనితో తమకు వచ్చే ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలన్న పాఠాన్ని ప్రజలు నేర్చుకున్నారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. లాక్​డౌన్​ కారణంగా మద్యం దుకాణాలు మూసివేయడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నిలిచిపోయింది.

ఈ క్రమంలో సర్కార్​ ఆదాయం పెంచుకునేందుకు మద్యం అమ్మకాలకు పచ్చజెండా ఊపింది. దీనితో మద్యం దుకాణాల వద్ద మద్యం ప్రియులు బారులు తీరి కనిపించారు. అయితే రెండు మూడురోజులు కొనుగోలుదారులు కనిపించినా.. ఆ తర్వాత మాత్రం మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి.

అమ్మకాలు తగ్గడానికి కారణాలు ఇవే

ప్రధానంగా బీర్లు భారీగా అమ్ముడయ్యే ఏప్రిల్​, మే మాసాల్లో మద్యం దుకాణాలు అనుమతించకపోవడం చాలా నష్టాన్ని మిగిల్చిందని చెబుతున్నారు. 2019 మేలో ఉమ్మడి కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా 6 లక్షల 49 వేల బీర్ల పెట్టెలు విక్రయిస్తే... ఈసారి మాత్రం కేవలం 2లక్షల 72వేల బీర్ల పెట్టెలు మాత్రమే విక్రయించారు.

దాదాపు 58శాతం అమ్మకాలు తగ్గాయని వ్యాపారులు మొత్తుకుంటున్నారు. లాక్​డౌన్​ క్రమంలో 266 దుకాణాల్లో నిల్వ ఉన్న బీర్లు చెడిపోయాయని అధికారులు తెలిపారు. సరైన సీజన్​లో దుకాణాలు బంద్​ కావడం.. బార్లకు అనుమతి లభించకపోవడం కూడా మద్యం అమ్మకాలు తగ్గడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

ధరలు పెంచడంతో...

మద్యం తక్కువ అమ్మినా... సర్కార్​ ఖజానాకు అనుకున్న ఆదాయమే సమకూరిందని అధికారులు అంటున్నారు. గతంతో పోలిస్తే.. విక్రయాల్లో 7శాతం వృద్ధి ఉందని చెప్పారు. లాక్​డౌన్​ వేళ మద్యం విక్రయాలు నిలిచిపోయినా.. పెరిగిన ధరల కారణంగా ఆదాయం పోటాపోటీగా పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కరీంనగర్​ ఆదాయం ఇలా...

కరీంనగర్‌లో గత సంవత్సరం మేలో 56.44కోట్ల రూపాయలు కాగా ఈ సంవత్సరం 70.66 కోట్లుగా నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం మే మాసంలో రూ.169 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి 205.97కోట్ల రూపాయలు వచ్చింది. అయితే మద్యం తక్కువగా విక్రయించినప్పటికీ 16 శాతం ధరలు పెంచడం వల్ల ఆదాయం పెరిగినట్లైంది. మద్యం ద్వారా ఆదాయం ఎంత ముఖ్యమైనా.. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రధానంగా దృష్టి సారించినట్లు అధికారులు వివరించారు.

ఇదీ చూడండి: నిధుల సమీకరణపై టాటా గ్రూప్ కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.