ETV Bharat / state

ఆంక్షలు కఠినతరం.. రోడ్లన్నీ నిర్మానుష్యం - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో నేటి నుంచి లాక్​డౌన్​ అమల్లోకి వచ్చింది. కరీంనగర్​ నగరంలో పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

lock down imposed strictly in karimnagar, karimnagar lock down
కరీంనగర్​లో లాక్​డౌన్, కరోనా లాక్​డౌన్
author img

By

Published : May 12, 2021, 1:53 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్ విధించిన నేపథ్యంలో కరీంనగర్​లో ఉదయం 10 గంటల నుంచి రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రేపు ఉదయం 6 గంటల వరకు లాక్​డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేయనున్నారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి నగరవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.

వంటగ్యాస్, ఆక్సిజన్ వాహనాలు మినహా అనుమతులు లేనివాటిని నిలిపివేస్తున్నారు. మెడికల్ షాపులు, ఆస్పత్రులు యధావిధిగా పనిచేస్తున్నాయి. లాక్​డౌన్ అమలుకు ప్రజలు సహకరించాలని సీపీ కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'జులై వరకూ కరోనా రెండో దశ ఉద్ధృతి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.