ETV Bharat / state

FISH SALES DOWN:చేపల విక్రయాలపై లాక్​ డౌన్ ప్రభావం - కరీంనగర్​లో చేపల మార్కెట్

మృగశిర కార్తె ప్రారంభం రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. ప్రజల్లో సెంటిమెంట్​ బలంగా ఉన్న ఈసారి మాత్రం ఆశించినస్థాయిలో అమ్మకాలు జరగడం లేదంటున్నారు విక్రయదారులు. లాక్​ డౌన్​ ప్రభావంతో చేపలు విక్రయాలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్​లోని చేపల మార్కెట్​లో ధరలు తగ్గించినా ప్రజల నుంచి స్పందన లేదంటున్నారు.

Lock down effect on corona situation on fish sales
చేపల విక్రయాలపై లాక్​ డౌన్ ప్రభావం
author img

By

Published : Jun 8, 2021, 6:59 PM IST

లాక్​ డౌన్ ప్రభావం చేపల విక్రయాలపై పడింది. మృగశిర కార్తె ప్రారంభం రోజు విధిగా చేపలు తినడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. అదే సెంటిమెంట్‌తో చేపల కొనుగోలుకు ప్రాధాన్యతనిస్తారు. కానీ ఈసారి కరీంనగర్​ మార్కెట్‌లో జనం రాలేదని విక్రయదారులు వాపోయారు. గతంలో ధర అధికంగా ఉన్నా చేపల కొనేందుకు పెద్దఎత్తున వచ్చేవారని.. ప్రస్తుత పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉందని వారు పేర్కొన్నారు.

గతంలో మృగశిర నాడు కనీసం 10 క్వింటాళ్ల చేపలను విక్రయించే వాళ్లమని ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు గతంతో పోలిస్తే చాలా తగ్గించినా విక్రయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నారు. కిలో చేపలు రూ.150 రూపాయల ధర నిర్ణయించినా కొనుగోళ్లు మాత్రం పెరగడం లేదని చెబుతున్నారు. మరోవైపు కొనుగోలుదారులు మార్కెట్లలో కరోనా నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. రాష్ట్రంలో పలుచోట్ల పోలీసులు వారిని నియంత్రించాల్సి వచ్చింది.

ఇదీ చూడండి: Eatala : అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధిచెబుతాం: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.