కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో ఆరో విడత హరితహారం నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లు హాజరై మొక్కలు నాటారు.
అనంతరం గుట్టపైన ఉన్న ఎర్రనేలలో... 175 ఎకరాల్లో పెంచిన హరితవనాన్ని కేటీఆర్ పరిశీలించారు. ఇప్పటి వరకు నాటిన మొక్కలు... వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అడవుల శాతంపై జిల్లాల వారీగా వివరాలను అధికారులు వివరించారు. 'పల్లె ప్రకృతి వనాలు' కార్యక్రమం గురించి జిల్లా కలెక్టర్ కేటీఆర్కు వివరించారు.
ఇవీ చూడండి: 'రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.. భావి తరాల కోసం'