కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న తిరుపతి మోటార్ సైకిల్ పై కరీంనగర్‌కు బయల్దేరాడు. గంగాధర మండలం కురిక్యాల వద్దకు చేరుకోగానే.. కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఓ లారీ తిరుపతి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో తిరుపతి అక్కడికక్కడే మృతిచెందాడు.. స్థానికుల సమాచారంతో లారీని గంగాధరలో పట్టుకున్నారు.
ఇవీ చూడండి:కాబూల్‌లో ఉగ్రదాడి..