జరిమానా కూడా
రైలు వ్యాగన్లలో తెప్పించిన సరుకును 8గంటల్లోపు దించుకోవాలన్న నిబంధన ఉంది. అలా చేయని పక్షంలో మొదటి గంట రూ.16 వేలు, రెండో గంటకు రూ.25వేలు, మూడో గంటకు రూ.30వేలుజరిమానా వసూలు చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు.
ఓవర్ బ్రిడ్జి
మరోవైపు రైల్వేస్టేషన్ సమీపంలో లెవల్ క్రాసింగ్ వద్ద ఓవర్ బ్రిడ్జి లేకపోవడం ప్రజలను ఇబ్బంది పెడుతోంది. గూడ్స్ రైళ్లు ఎక్కువగా రావటంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. రైల్వేగేటు సమీపంలోనే ఆసుపత్రులు అధికంగా ఉండటంతో అంబులెన్సులకు కూడా అవాంతరాలు ఎదురవుతున్నాయి.
ఓవర్ బ్రిడ్జి నిర్మించడంతో పాటు గూడ్స్ షెడ్ వద్ద తగు సదుపాయాలు కల్పించాలని ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు.
ఇవీ చూడండి:"ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయండి"