విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు కేంద్ర హోంశాఖ అందించే మెడల్‌కు కరీంనగర్ పోలీస్ శిక్షణ కళాశాలకు చెందిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ మోడం సురేష్ ఎంపికయ్యారు. 2019-20 సంవత్సరంలో పోలీసులకు శిక్షణ ఇవ్వడంలో నిరంతరం శ్రమించి సఫలీకృతం అయినందుకు గాను... ఆయనను అవుట్ డోర్ విభాగంలో ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
దీనికి ఎంపికవడం పట్ల పలువురు పోలీస్ అధికారులు సురేష్‌కు అభినందనలు తెలిపారు. మెడల్ కోసం దేశవ్యాప్తంగా 277 మందిని ఎంపిక చేయగా తెలంగాణకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు.
ఇదీ చదవండి: మొక్కలు నాటిన మోనాల్ గజ్జర్.. మరికొందరికి గ్రీన్ 'ఛాలెంజ్'