karimnagar drainage system: కరీంనగర్‌లోని డ్రైనేజీల సామర్థ్యం అంతంతా మాత్రంగానే ఉండటంతో చినుకు పడితే చాలు నగర వీధులు జలమయమవుతున్నాయి. ఎగువ నుంచి వచ్చే నీటితో కాల్వలు నిండి రహదారుల మీదికి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునగడం పరిపాటిగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో గృహనిర్మాణాలు పెరగడంతో 30 ఏళ్ల కింద కట్టిన డ్రైనేజీలు సరిపోవటం లేదు. వర్షంపడితే చాలాచోట్ల అపార్ట్‌మెంట్‌లలోని సెల్లార్లలోకి నీరు చేరటంతో పలు కాలనీల వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షం పడితే చాలా కష్టం అవుతుంది. మొత్తం నీరు లోపలికి వస్తున్నాయి. డ్రైనేజీ సిస్టమ్ బాగాలేదు. అపార్ట్మెంట్లోకి నీరు వచ్చి చేరుతోంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. గత 30 సంవత్సరాలుగా ఇదే సమస్య. ఎన్ని సార్లు చెప్పినా... ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నో కోట్లు ఖర్చు చేస్తున్నారు.
- కాలనీ వాసులు
Karimnagar People Suffering Due to Lack of Facilities: ఏళ్ల తరబడిగా సమస్య అలాగే ఉన్నా పరిష్కరించట్లేదనే స్థానికులవిమర్శలకు చెక్‌పెట్టేలా స్మార్ట్‌సిటీలో శాశ్వత పరిష్కారం చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 135 కోట్లతో ప్రధానమైన నాలాల విస్తరణ, అభివృద్ధి చేపట్టేందుకు.. స్మార్ట్‌సిటీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇటీవలే స్మార్ట్‌సిటీ బోర్డు సమావేశంలో సాంకేతిక అనుమతి లభించిందని... వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామని మేయర్ సునీల్ రావు తెలిపారు.
135 కోట్లతో నాలాల విస్తరణ, అభివృద్ధి చేపట్టేందుకు మొన్ననే స్మార్ట్‌సిటీ బోర్డు ఆమోదం తెలిపింది. రాబోయే 6 నుంచి 9 నెలల్లో పూర్తి చేస్తాం. వచ్చే వర్షకాలం వరకు.. డ్రైనేజ్ వ్యవస్థను పునర్నిర్మిస్తాం.
- మేయర్ సునీల్ రావు
Karimnagar People Suffering: నగరంలో వరదకాల్వల నిర్మాణానికి సంబంధించి ఐదు జోన్లుగా ఖరారు చేశారు. ఇందులో మొత్తం 736.3 కిలోమీటర్ల పొడవునా నాలాలు నిర్మిస్తారు. ఆ పనులు పూర్తయితే వరద సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని అధికారులు తెలిపారు. స్మార్ట్‌సిటీ నిధులతో చేపట్టనున్న పనులుయుద్దప్రాతిపదికన చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు స్థానికత చూశారు.. కానీ బదిలీల్లో చూడరేం.?'