ETV Bharat / state

'సమస్యలు పరిష్కరించమంటే... చితకబాదుతారా?' - కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఖండించారు. వారిని విద్యార్థులనుకుంటున్నారా లేక విద్రోహశక్తులనుకుంటారా అంటూ నిలదీశారు.

Karimnagar MP Bandy Sanjay Kumar fires on CM KCR

author img

By

Published : Mar 11, 2020, 2:33 PM IST

విద్యారంగ సమస్యలను పరిష్కరించమంటే ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు ఇష్టం వచ్చినట్లు చితకబాదుతారా అంటూ కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ మండిపడ్డారు. విద్యార్థులపై లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నిలుపుకోవటంతోపాటు సమస్యలు పరిష్కరించమని విద్యార్థులు అడిగితే తప్పా అని ప్రశ్నించారు.

విద్యార్థులపై పోలీసులను ఎగేసి నువ్వు మాత్రం ఫాంహౌస్‌లో సేద తీరుతున్నావా అని సీఎం కేసీఆర్ నుద్దేశించి బండి సంజయ్​ అన్నారు. ఉద్యమకారుడివని చెప్పుకునే మీరు విద్యార్థి ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతారా అని ధ్వజమెత్తారు. విద్యార్థులు తిరగబడితే ఏం జరుగుతుందో త్వరలోనే పాలకులు చూస్తారని ఎంపీ సంజయ్​ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ యత్నం.. ఉద్రిక్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.