కరోనా రెండోదశ విజృంభిస్తున్న వేళ అర్హులైన ప్రతి ఒక్కరు టీకాలు తీసుకోవాలని కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు సూచించారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలోని కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లో ఆయన టీకా వేయించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ను అందిస్తుందని.. ఈ నేపథ్యంలో అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సునీల్ తెలిపారు. కొవిడ్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అపోహలను వీడి ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి: పడక లభించక కారులోనే కరోనా రోగి మృతి