కరీంనగర్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటు కోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చర్యలు ముమ్మరం చేశారు. నగరంలోని తెలంగాణ ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న స్థలాన్ని మేయర్ సునీల్ రావు, కమిషనర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16 అడుగుల విగ్రహాన్ని నగరపాలిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. జూన్ 28న నిర్వహించే శతజయంతి ఉత్సవాల్లోగా విగ్రహ ఆవిష్కరణ పూర్తి చేస్తామని వివరించారు.
ఇదీ చదవండి: ఇప్పుడేమీ మాట్లాడొద్దు! మరి ఇంకేం మాట్లాడాలి?