ETV Bharat / state

అక్రమార్కులందరూ భాజపాలోనే చేరుతున్నారు: సునీల్ రావు - భాజపాపై మేయర్​ సునీల్ విమర్శలు

రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతున్న అక్రమార్కులందరూ భాజపాలో చేరుతున్నారని కరీంనగర్​ మేయర్ సునీల్ రావు ఆరోపించారు. నాగార్జునసాగర్​ ఫలితమే హుజూరాబాద్​లో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

karimnagar mayor sunil rao
కరీంనగర్​ మేయర్ సునీల్ రావు
author img

By

Published : Jun 20, 2021, 8:33 PM IST

హుజూరాబాద్​ ఉపఎన్నికలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కరీంనగర్​ మేయర్ సునీల్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అవినీతిపరులే భాజపాలో చేరుతున్నారని ఆరోపించారు. నాగార్జునసాగర్ ఉఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన భాజపా.. హుజూరాబాద్​లో ఎలా గెలుస్తుందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో గడీల పాలన సాగుతోందని బండి సంజయ్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అక్రమాస్తులు కలిగిన వారికి భాజపా అండగా నిలుస్తోందని విమర్శించారు. పది ఎకరాల స్థలంలో ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఈటల రాజేందర్ కాదా ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో హుజూరాబాద్​లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. బండి సంజయ్ ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానుకోవాలని మేయర్ సునీల్ రావు హితవుపలికారు.

ఇదీ చూడండి: Rakesh Reddy: గతంలో ఇచ్చిన సీఎం హామీల అమలు ఎక్కడ? : రాకేశ్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.