స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్లో అంతర్గత రహదారుల నిర్మాణం చేపడుతున్నామని నగర మేయర్ సునీల్ రావు తెలిపారు. 54వ డివిజన్ మంకమ్మ తోటలో రోడ్డు పనులకు కార్పొరేటర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. నగరంలోని రహదారులు ఇప్పటికే 70 శాతం వరకు పూర్తయ్యాయని మేయర్ వెల్లడించారు. మిగతా వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
కరీంనగర్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మేయర్ కోరారు. కాలనీల్లో, ఇళ్ల ముందు, రోడ్డుపై ర్యాంపులు వేయడం వల్ల సీసీ రోడ్ల పనులకు ఇబ్బందిగా మారిందని అన్నారు. రహదారుల నిర్మాణానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని... బాధ్యతగా మాస్కులు ధరించాలని, అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావొద్దని సునీల్ రావు సూచించారు.
ఇదీ చదవండి: Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!