ప్రజల ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్‌లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ సునీల్ రావు అన్నారు. 7వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల పిల్లల పార్కులో రూ. 5 లక్షలతో నిర్మించే వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
మొదటి దశలో 30 వ్యాయామశాలల ఏర్పాటుకు టెండర్లు పిలిచామన్నారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులకు నగరప్రజలు సహకరించాలని కోరారు. కాశ్మీర్ గడ్డ, మంకమ్మతోట ప్రాంతాల్లో పర్యటించిన మేయర్ రాజు పార్కు మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల పద్మ, ఈ ఓం ప్రకాష్ పాల్గొన్నారు
ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు మృతి