Karimnagar Girls Govt School Problems : కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్‌లో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసారు. అందులో తొలుత ఉర్దూమీడియం, ఆ తర్వాత తెలుగు, ఇటీవల ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. అంతవరకు బాగానే ఉన్న పాఠశాలలో సదుపాయాలకు ఏమాత్రం శ్రద్ద వహించడం లేదని విద్యార్ధినులతో పాటు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తరగతి గదిలో చదువుకుంటున్నప్పుడు తలపైకెత్తితే చాలు ఎక్కడ పైకప్పు కూలుతుందో అన్న భయం విద్యార్దులకు వెంటాడుతోంది. దాదాపు 200మంది విద్యార్ధినులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయుల కొరత ఉందని, అంతేకాకుండా స్టాఫ్‌రూంతో పాటు తరగతి గదులు కూడా అధ్వాహ్నంగా మారాయి. దాదాపు నైజాం కాలంలో పాఠశాలను ప్రారంభించారు.
అధ్వాన్నంగా కళాశాల - వసతుల్లేక విద్యార్థులు విలవిల - ఇలా అయితే చదువులు సాగేదెలా!
Karimnagar Girls Govt School Dilapidated : పాఠశాల స్థితిగతులను చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడం మానేశారు. దీనితో తెలుగు మీడియం తరగతులను రద్దు చేసుకున్నారు.ప్రస్తుతం ఉర్దూతో పాటు ఆంగ్ల మాధ్యమం మాత్రమే కొనసాగుతోంది. తరగతి గదులతో పాటు వంట గది, మూత్రశాలలు కూడా కూలిపోయాయని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు వినడం తప్ప పరిష్కరించే వారు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం కురిసినా తమ తరగతి గది కూలడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా మధ్యాహ్న భోజనం వంటశాల కూడా ఇబ్బందికరంగా ఉందని కార్మికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది. మాకు మంచి సౌకర్యాలు కల్పించాలి. తల్లి దండ్రులు అడ్మిషన్ కోసం వచ్చి సౌకర్యాలు బాగా లేవని వెళ్లిపోతున్నారు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచడం లేదు. పాఠశాలలో 200 మంది విద్యార్థులు ఉంటాం. కానీ మాకు కనీస సౌకర్యాలు లేవు. వంటగది సరిగ్గా లేదు, భోజనం చేయడానికి సరైన వసతి లేదు. ప్రభుత్వం మాకు కొత్త భవనం కట్టించాలి."- విద్యార్థులు
రోడ్డుపై బైఠాయించిన నిజాం కళాశాల విద్యార్థినులు - వసతి గృహంలో సదుపాయాలు కల్పించాలని డిమాండ్
అధికారులు తక్షణం స్పందించాలి : పాఠశాలలో విద్యార్దులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ప్రధానోపాధ్యాయులు అంగీకరించారు. విద్యార్థుల సమస్యల గురించి తమ వంతుగా ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్నట్లు తెలిపారు.దశాబ్దాల క్రితం ప్రారంభమైన పాఠశాలకు మరమ్మతులు కరవయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సదుపాయాలు కొరవడిన కారణంగా తెలుగు మీడియం విద్యార్దులను పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో తెలుగు మాధ్యమం మూతపడిందని తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే విద్యార్దుల సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్దుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొత్త భవనాన్ని మంజూరు చేయాలని, దీనితో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విద్యార్ధినులు వారి తల్లిదండ్రలు విజ్ఞప్తి చేస్తున్నారు.
"ఈ పాఠశాల చాలా పురాతన కాలంలో కట్టించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఏ క్షణానైనా కూలిపోయే ప్రమాదం ఉంది. భవనం పై భాగం పగుల్లు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో పై నుంచి నీరు కారుతోంది. తక్షణం అధికారులు స్పందించి నూతన భవనం కట్టించాలని కోరుతున్నాం." - కృష్ణగోపాల్, ప్రధానోపాధ్యాయుడు
Lack of Infrastructure in govt schools: ఇరుకిరుకు గదులు.. నేలపైనే చదువులు..!