మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా పోటీలను వారు ప్రారంభించారు.
స్నేహ భావం..
ఈ పోటీల్లో మహిళలకు కబడ్డీ, కోకో, పురుషులకు క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ప్రతి సంవత్సరం క్రీడలను నిర్వహించడం వల్ల ఉద్యోగుల మధ్య స్నేహభావం పెరిగి.. ఐక్యతతో పని చేస్తారని వివరించారు.
ఇదీ చదవండి: కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్