కరోనా వ్యాప్తి నివారణకు ప్రయోగాలు, ఆవిష్కరణలు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. కరీంనగర్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు శ్వేత, స్నేహలు కరోనా వ్యాప్తి నివారణకు శానిటైజర్‌తో చేతులు శుభ్రపరుచుకొని రావాలని, కరచాలనం చేయొద్దని, భౌతిక దూరం పాటించేలా హెచ్చరించే ఐడీ కార్డు, కొవిడ్ – 19 స్మార్ట్ గడియారం తయారుచేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో అక్కా చెల్లెళ్లు తయారు చేసిన ప్రయోగాలను జిల్లా కలెక్టర్ కె.శశాంక ముందు ఆవిష్కరించారు.
ప్రతి ఒక్కరు ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఆవిష్కరణలు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వారు తయారు చేసిన ఆవిష్కరణలను కార్యాలయాలకు ఉపయోగపడే విధంగా తయారుచేసినట్లైతే వాటికి అయిన ఖర్చు ప్రభుత్వపరంగా భరించడమే కాకుండా... కార్యాలయాలలో ఉపయోగించుకొనేందుకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ శశాంక హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: సెప్టెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం!