ETV Bharat / international

సెప్టెంబర్​ నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం! - కరోనా వైరస్ చికిత్స

కరోనా వైరస్​కు సెప్టెంబర్ ​కల్లా టీకాను అందుబాటులోకి తెస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది ఆక్స్​ఫర్డ్​ అనుబంధ సంస్థ జెన్నర్​ ఇనిస్టిట్యూట్​. సంస్థ చేసిన క్లినికల్​ ట్రయల్స్​లో అనుకున్న ఫలితాలు వచ్చాయని చెబుతున్న పరిశోధకులు.. మేలో 6 వేల మందిపై ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

CORONA VACCINE
కరోనా వ్యాక్సిన్
author img

By

Published : Apr 28, 2020, 1:00 PM IST

కరోనా వైరస్​కు టీకా కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఆక్స్​ఫర్డ్ అనుబంధ సంస్థ జెన్నర్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.

తమ పరిశోధకులు చేస్తోన్న క్లినికల్ ట్రయల్స్​లో పురోగతి ఆధారంగా ఈ ప్రకటన చేసింది ఇంగ్లాండ్​కు చెందిన జెన్నర్ ఇనిస్టిట్యూట్. సెప్టెంబర్​ కల్లా కొన్ని లక్షల డోసులను సిద్ధం చేస్తామనే ఆశాభావం వ్యక్తం చేసింది.

6 వేల మందిపై ప్రయోగం..

ప్రపంచంలో చాలా సంస్థలు ఇంకా వ్యాక్సిన్​ తయారీలో తొలిదశలోనే ఉన్నాయి. జెన్నర్​ మాత్రం ఆరంభంలోనే అదరగొట్టిందని, ఇప్పటివరకు చేసిన ప్రయోగాల వల్ల మనుషులపై ఈ టీకా ప్రభావవంతంగా పనిచేస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఫలితంగా మే చివరి వారంలో జెన్నర్ తయారు చేసిన టీకాను 6 వేల మందిపై ప్రయోగించనుంది ఈ సంస్థ. ఈ టీకా వారిపైనా ఫలితాన్ని ఇస్తుందని, అంతేకాకుండా ఎలాంటి హాని కలిగించదని విశ్వాసం వ్యక్తం చేశారు పరిశోధకులు . ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే భారీగా డోసులు సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు.

కోతులపై సత్ఫలితాలు..

మోంటానా జాతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్​లో మార్చి నెలలో జెన్నర్ సంస్థ తయారు చేసిన టీకాలను తొలుత రీసస్ మకావ్ కోతులపై తక్కువ స్థాయిలో ప్రయోగించారు.

"ఈ రీసస్ మకావ్ జాతి కోతుల లక్షణాలు మానవులకు దగ్గరగా ఉంటాయి. టీకా ఇచ్చిన కోతుల్లో వైరస్ ప్రవేశపెట్టగా మొదట అనారోగ్యం పాలయ్యాయి. 28 రోజుల తర్వాత కోలుకున్నాయి. ప్రస్తుతం అవి ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ ఫలితాలను మరింత విశ్లేషిస్తున్నాం. ఇతర శాస్త్రవేత్తలతోనూ పంచుకుంటాం."

- డాక్టర్ విన్సెంట్ మన్​స్టర్, పరిశోధకుడు

జన్యు పరివర్తనపైనా..

అయితే చైనా కంపెనీ సైనోవాక్​ చేసిన ప్రయోగాలు ఈ తరహా భరోసాను ఇవ్వలేదని విన్సెంట్ తెలిపారు. ఆక్స్​ఫర్డ్​ ప్రయోగాల ఫలితాలను గమనిస్తే అన్ని సంస్థలకన్నా వ్యాక్సిన్ తయారీలో చాలా ముందున్నామని అన్నారు. జన్యు పరివర్తనను కూడా తమ వ్యాక్సిన్ ఎదుర్కొంటుందని చెప్పారు.

"కరోనా వైరస్ పరివర్తన చెందుతూ జన్యు క్రమాన్ని మార్చుకుంటుంది. ఈ సవాలును ఎదుర్కొనేందుకు.. ఈ టీకా వైరస్​ను మొదట తటస్తీకరించుకొని అనంతరం దానితో తలపడుతుంది."

- డాక్టర్ విన్సెంట్ మన్​స్టర్​, పరిశోధకుడు

ఇదీ చూడండి: వైరస్‌పై పోరులో సరికొత్త ఆవిష్కరణలే శరణ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.