ETV Bharat / state

పోటెత్తిన వరద... స్తంభించిన రాకపోకలు - కరీంనగర్​ బైపాస్​ బ్రిడ్జి మూసివేత

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్​ జిల్లా వెలిచాల వద్దనున్న బైపాస్​ రోడ్డు వరద నీటితో మూసుకుపోయింది. వానలు కురిసిన ప్రతి సారి స్థానిక లో లెవెల్​ వంతెనపై నీళ్లు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

karimnagar bypass bridge drowned inside water due to rains
వరద ప్రవాహానికి మూసుకుపోయిన కరీంనగర్ బైపాస్ రోడ్డు
author img

By

Published : Sep 15, 2020, 12:28 PM IST

కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెలిచాల వద్ద భారీ వర్షాలు కురుస్తుండగా వరద ప్రవాహానికి బైపాస్​ రోడ్డు మూసుకుపోయింది. ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి ఉండగా.. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ మేరకు జగిత్యాల, నిజమాబాద్​, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు నిలిచిపోయాయి.

వెలిచాల మలుపు వద్ద లో లెవెల్​ వంతెన నిర్మించి ఉండగా వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల సుమారు పది గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు కురిసిన ప్రతి సారి వారం- పది రోజులపాటు వంతెనలో నీళ్లు నిలిచి వాహనాదురులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. దానికి ప్రత్యామ్నాయం వెతకాలని సూచించారు.

ఇదీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతాలు ఆపాలని కోరిన తెలంగాణ సర్కారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.