కరీంనగర్ జిల్లా బస్టాండ్ ఎదుట జిల్లా ఆర్కెస్ట్రా కళాకారుల సంఘం, పోలీసు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. యముడు, కరోనా రాక్షసి, శివుడు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికుల వేషధారణలు ధరించి నాటక ప్రదర్శన చేశారు.
ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని... తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వస్తే మాస్కులు ధరించాలని నాటకం ద్వారా తెలిపారు. లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరు విధిగా పాటించి.. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని కోరారు.
ఇదీ చూడండి: ప్రమాదంలో క్షౌర వృత్తిదారులు