ETV Bharat / state

గత హరితహారం మొక్కలు పరిశీలించిన కలెక్టర్​ శశాంక - కరీంనగర్​ జిల్లా వార్తలు

స్థలానికి తగ్గ మొక్కలు ఎంపిక చేసి.. నాటితే బాగా ఎదుగుతాయని సూచించారు కరీంనగర్​ జిల్లా కలెక్టర్​ కె.శశాంక. ఈ నెల 25న ఆరో విడత హరితహారం ప్రారంభం కానున్న నేపథ్యంలో మేయర్​ సునీల్​ రావు, కమిషనర్​ వల్లూరు క్రాంతిలతో కలిసి స్థల పరిశీలన చేశారు.

Karim Nagar Collector Inspects Haritha Haram Placecs
గత హరితహారం మొక్కలు పరిశీలించిన కలెక్టర్​ శశాంక
author img

By

Published : Jun 22, 2020, 7:51 PM IST

కరీంనగర్​ జిల్లా కలెక్టర్​ శశాంక ఈ నెల 25న ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. గత హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ఆయన పాదయాత్ర చేసి పర్యవేక్షించారు. స్థలానికి అనువైన మొక్కలను ఎంపిక చేసి...నాటాలని అధికారులకు సూచించారు. ఆరో విడత హరితహారం ఏర్పాట్లలో భాగంగా మేయర్ సునిల్ రావు, కమిషనర్ వల్లూరు క్రాంతిలతో కలిసి స్థల పరిశీలన చేశారు. కరీంనగర్​లోని సిరిసిల్ల బైపాస్ రోడ్, ఉజ్వల పార్కు సమీపంలోని మానేరు డ్యామ్​ను సందర్శించారు. డ్యామ్​ దిగువ భాగంలో గతంలో నాటిన మొక్కల బ్లాకుల స్థలాన్ని పరిశీలించారు. క్రీడా పాఠశాల ఎదురుగా ఉన్న 5వ బ్లాక్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్క నాటిన 9వ బ్లాక్ వరకు డ్యామ్​పై పాదయాత్ర చేస్తూ నిశితంగా సంబంధిత స్థలాలను పరిశీలించారు. లేక్ పోలీస్ స్టేషన్, వాటర్ ట్యాంక్, డ్యామ్​ దిగువభాగంలో ఉన్న పలు దేవాలయాల స్థలాలను పరిశీలించారు.

నగరపాలక సంస్థ అధికారులు, ఫారెస్టు అధికారులకు హరితహారం గురించి పలు సలహాలు, సూచనలు చేశారు. గతంలో నాటిన హారితహారం బ్లాక్​ల మధ్య స్థలాలను ఎంపిక చేసి.. మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా నగరంలోని భగత్​సింగ్ చౌరస్తా నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు స్మార్ట్ రోడ్ పనులను పరిశీలించారు. పార్కింగ్, మల్టీ ఫంక్షనల్​ జోన్​కు సంబంధించిన ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక అధికారులతో కొలతలు వేయించారు. గుర్తించిన స్థలాలలో మియావోకి ప్లాంటేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

2017 హారితహారంలో మానేరు డ్యామ్​ దిగువ ప్రాంతం మొత్తం పెద్దఎత్తున బ్లాకులలో మొక్కలు నాటామని కలెక్టర్​ తెలిపారు. 5వ బ్లాక్ నుంచి 9వ బ్లాక్ వరకు ఉన్న మిగిలిన ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని సూచించారు. బ్లాక్ ల మద్యలో ఉన్న ముళ్ల చెట్లు, కలుపు మొక్కలు, డిబ్రీ లాంటి వాటిని తొలగించి చదును చేయాలని ఆదేశించారు. వాకింగ్ ట్రాక్​కు స్థలాన్ని వదిలేసి ఇరువైపుల క్రమపద్ధతిలో మొక్కలు నాటాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

ఇదీ చూడండి: వేములవాడలో పొన్నం ప్రభాకర్ గృహ నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.