ప్రపంచంలోనే పెళ్లి ఖర్చులకు డబ్బు ఇస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమేని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో 66మంది లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. గత నాలుగేళ్లుగా కేవలం ఒక్క కరీంనగర్ నగరంలోనే 1,114 మంది లబ్ధిదారులకు 10కోట్ల 98లక్షల రూపాయల చెక్కులు అందించినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా చెక్కుల పంపిణీలో కొంత ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మానవీయ కోణంలో పథకాలు అమలు చేసే ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని అన్నారు.
షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 66 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.