ETV Bharat / state

Kaleshwarm: ఆరు పంపులతో కాళేశ్వరం జలాల ఎత్తిపోత

కాళేశ్వరం జలాలను తరలించడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. గాయత్రి పంప్​ హౌస్​ నుంచి ఆరు బాహుబలి పంపులతో ఎత్తిపోతలు చేపట్టారు. రాంపూర్ పంప్​హౌస్​లో మరో రెండు మోటార్లతో, రాజేశ్వర్‌రావుపేట్‌ రివర్స్​ పంప్​హౌస్​ ద్వారా నీటిని ఎత్తిపోయనున్నట్లు అధికారులు తెలిపారు.

Kaleshwaram water pamping
ఆరు పంపులతో కాళేశ్వరం జలాల ఎత్తిపోత
author img

By

Published : Jun 27, 2021, 8:02 AM IST

కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్‌హౌస్‌లో ఆరు బాహుబలి పంపులతో ఎత్తిపోతలు చేపట్టారు. పంప్‌హౌస్‌ నుంచి సుమారు 20 వేల క్యూసెక్కుల గోదావరి జలాలు ఎస్సారెస్పీ వరదకాలువలోకి తరలివెళ్తున్నాయి. భారీ ప్రవాహంతో ఎత్తిపోతల జలాలు శ్రీరాములపల్లి జంక్షన్‌ పాయింట్‌ నుంచి రెండు వైపులా ప్రవహిస్తున్నాయి. దిగువన మధ్యమానేరు ప్రాజెక్టుకు, ఎగువ వైపు శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకానికి ఎత్తిపోతలకు జలాలు తరలివెళ్తున్నాయి. గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి సుమారు ఆరు కిలో మీటర్ల మేర గల గ్రావిటీ కాలువ నిండుగా ప్రవహిస్తోంది. తాజా ఎత్తిపోతలతో రోజుకు సుమారు రెండు టీఎంసీల నీటిని తరలిస్తున్నారు.

మల్యాల: రాంపూర్‌ పంప్‌హౌస్‌లో శనివారం అధికారులు మరో రెండు మోటార్లు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం ఒక మోటారును ప్రారంభించారు. మూడు మోటార్ల ద్వారా ప్రతి రోజు 0.375 టీఎంసీల నీటిని వరద కాలువలోకి పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇబ్రహీంపట్నం: ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా రాజేశ్వర్‌రావుపేట్‌ వరద కాలువ వద్ద నిర్మించిన రివర్స్‌ పంపుహౌస్‌ నుంచి నీటి ఎత్తిపోతలను అధికారులు ప్రారంభించారు. శనివారం సాయంత్రం ఒక మోటారుతో 1400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. రాత్రి రెండో మోటారు ద్వారా ఎత్తిపోయన్నుట్లు ఈఈ సుధాకిరణ్‌ తెలిపారు.

మధ్యమానేరులో 13.04 టీఎంసీల నీరు నిల్వ

బోయినపల్లి: రాజరాజేశ్వర జలాశయం(మధ్యమానేరు)లో 13.04 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గాయత్రి పంపుహౌస్‌ వరద కాలువ ద్వారా జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గడంతో దిగువన ఎల్‌ఎండీకి నీటి విడుదలను తగ్గించారు. 16,000 క్యూసెక్కులు గాయత్రి పంపుహౌస్‌ నుంచి, వరద ద్వారా మరో 150 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ఉదయం ఎల్‌ఎండీకి 11 గేట్ల ద్వారా 17,960 క్యూసెక్కులు విడుదల చేయగా సాయంత్రం ఆరు గేట్ల ద్వారా 9,900 క్యూసెక్కులను వదులుతున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు (318 మీటర్లు) కాగా ప్రస్తుతం 311.08 మీటర్లు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.