JP NADDA About Bandi Sanjay Deeksha: రాష్ట్రంలో పార్టీ గెలుపును ఓర్వలేకనే కేసీఆర్ సర్కారు.. కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసినా ప్రజాసమస్యలపై పోరు ఆగదని స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్టును ఆయన ఖండించారు. ఈ మేరకు బండి సంజయ్‌తో జేపీ నడ్డా ఫోన్‌లో మాట్లాడారు.
-
कल रात @BJP4Telangana के प्रदेश अध्यक्ष @bandisanjay_bjp जी के साथ तेलंगाना की केसीआर सरकार ने जिस अमानवीय तरीके से मारपीट की, कार्यकर्ताओं पर लाठीचार्ज किया और उन्हें गिरफ्तार किया, वह दुःखद एवं निंदनीय है। यह लोकतंत्र की हत्या है। हम इस कुत्सित प्रयास की कड़ी भर्त्सना करते हैं। pic.twitter.com/CE66azMLPj
— Jagat Prakash Nadda (@JPNadda) January 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">कल रात @BJP4Telangana के प्रदेश अध्यक्ष @bandisanjay_bjp जी के साथ तेलंगाना की केसीआर सरकार ने जिस अमानवीय तरीके से मारपीट की, कार्यकर्ताओं पर लाठीचार्ज किया और उन्हें गिरफ्तार किया, वह दुःखद एवं निंदनीय है। यह लोकतंत्र की हत्या है। हम इस कुत्सित प्रयास की कड़ी भर्त्सना करते हैं। pic.twitter.com/CE66azMLPj
— Jagat Prakash Nadda (@JPNadda) January 3, 2022कल रात @BJP4Telangana के प्रदेश अध्यक्ष @bandisanjay_bjp जी के साथ तेलंगाना की केसीआर सरकार ने जिस अमानवीय तरीके से मारपीट की, कार्यकर्ताओं पर लाठीचार्ज किया और उन्हें गिरफ्तार किया, वह दुःखद एवं निंदनीय है। यह लोकतंत्र की हत्या है। हम इस कुत्सित प्रयास की कड़ी भर्त्सना करते हैं। pic.twitter.com/CE66azMLPj
— Jagat Prakash Nadda (@JPNadda) January 3, 2022
పోరాటం ఆగదు
మొన్నటి వరకు రైతుల సమస్యలపై బండి సంజయ్ పోరాటం చేశారన్న జేపీ నడ్డా.. జీవో 317 పై ఆయన పోరాటం అమోఘమని కొనియాడారు. కేసులు పెట్టారని భయపడొద్దని బండి సంజయ్‌కు చెప్పారు. పోరాటంలో ముందుకెళ్లాలని సూచించారు. కేసీఆర్ సర్కారును న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కారు చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ట్విట్టర్ ద్వారా వీడియో విడుదల చేశారు.
-
నిన్న రాత్రి @BJP4Telangana అధ్యక్షుడు శ్రీ @bandisanjay_bjp పై తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం దాడి, అరెస్టు, బిజెపి కార్యకర్తలపై లాఠీచార్జి అమానుషం.. తీవ్ర విచారకరం.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.. ఈ దురుద్దేశపూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. pic.twitter.com/n07yp0FH8i
— Jagat Prakash Nadda (@JPNadda) January 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">నిన్న రాత్రి @BJP4Telangana అధ్యక్షుడు శ్రీ @bandisanjay_bjp పై తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం దాడి, అరెస్టు, బిజెపి కార్యకర్తలపై లాఠీచార్జి అమానుషం.. తీవ్ర విచారకరం.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.. ఈ దురుద్దేశపూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. pic.twitter.com/n07yp0FH8i
— Jagat Prakash Nadda (@JPNadda) January 3, 2022నిన్న రాత్రి @BJP4Telangana అధ్యక్షుడు శ్రీ @bandisanjay_bjp పై తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం దాడి, అరెస్టు, బిజెపి కార్యకర్తలపై లాఠీచార్జి అమానుషం.. తీవ్ర విచారకరం.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.. ఈ దురుద్దేశపూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. pic.twitter.com/n07yp0FH8i
— Jagat Prakash Nadda (@JPNadda) January 3, 2022
ప్రజాస్వామ్యం ఖూనీ
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిన్న కరీంనగర్‌లోని భాజపా కార్యాలయంలో బండి సంజయ్ ఉపవాస దీక్ష చేపట్టారు. కానీ తెలంగాణ పోలీసులు వెళ్లి కార్యాలయ షెట్టర్లు ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు. కార్యకర్తలపై లాఠీఛార్జి, భౌతిక దాడులకు పాల్పడి బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. ఇది సరికాదు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. కేసీఆర్ సర్కారు వినాశకాలానికి, విపరీత బుద్ధికి ఇది నిదర్శనం. భాజపా కార్యకర్తలంతా ఐక్యంగా ఉపాధ్యాయుల తరఫున, ప్రజా సమస్యలపై పోరాడతారు. ఈ పోరులో న్యాయమే గెలుస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం తీరుపై అన్ని ఆధారాలతో ప్రజాస్వామ్యయుతంగా.. న్యాయపరంగా పోరాటం చేస్తాం.
- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
నాన్‌బెయిలబుల్ కేసు
Bandi Sanjay Arrest: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన.. జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ భాజపా చేపట్టిన జాగరణ దీక్షను.. పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయం వద్ద బండి సంజయ్ తలపెట్టిన దీక్షకు అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. ఆంక్షలను తప్పించుకొని.. కార్యాలయంలోకి వెళ్లి సంజయ్ దీక్ష చేపట్టగా, పోలీసులు తలుపులు పగులగొట్టి.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, భాజపా కార్యకర్తల మధ్య.. తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయనను కరీంనగర్ కోర్టుకు తరలించారు.
ఇదీ చదవండి: Bandi Sanjay Arrest Updates : కరీంనగర్ కోర్టుకు బండి సంజయ్ తరలింపు