కరీంనగర్లో కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా చేపట్టిన లాక్డౌన్తో చిరు వ్యాపారులు నష్టపోతున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు జమాతే ఇస్లామి నాయకులు ముందుకొచ్చారు. సాలెహ్నగర్ మైసమ్మ వాడలో ఉంటున్న 100 మందికి వెయ్యి రూపాయల విలువైన నిత్యావసర సరుకులను అందించారు. కరోనా వ్యాప్తి నిర్మూలనకు 24 గంటల పాటు సేవలందిస్తున్న వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: కరోనా కాలం.. నయా పంథాలో సైబర్ నేరగాళ్లు