కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రం శివారు వాగులో సమాధులు తవ్వి ఇసుక అక్రమ రవాణా చేశారు. రాత్రివేళ ప్రొక్లైనర్తో ఇసుక తవ్వడం వల్ల మృతదేహాలు, అస్థిపంజరాలు బయటపడ్డాయి.
అనారోగ్యంతో మృతి చెందిన స్థానికుణ్ని ఖననం చేసేందుకు వెళ్లిన బంధువులు.. సమాధులు తవ్వి ఇసుక తీయడం చూసి ఆశ్చర్యపోయారు. కుక్కలు అస్థిపంజరాలు తీసుకురావడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణాను అధికారులు కట్టడి చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చదవండి: వందేళ్ల సమస్యలకు తెరాసతోనే మోక్షం: మంత్రి తలసాని