ETV Bharat / state

​ హరితహారంలో ఆ​ కమిషనరేట్​ రాష్ట్రానికే ఆదర్శం​: డోబ్రియల్​

author img

By

Published : Nov 6, 2020, 2:35 PM IST

హరితహారం కార్యక్రమంలో కరీంనగర్​ పోలీస్​ కమిషనరేట్​ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని ప్రిన్స్​పల్ ఫారెస్ట్​ చీఫ్​ కన్జర్వేటర్​ ఆర్​ఎం డోబ్రియల్​ అన్నారు. మియావాకి పద్ధతిలో మొక్కలు పెంచడాన్ని ప్రోత్సహిస్తున్న సీపీ కమలాసన్​ రెడ్డిని ఆయన అభినందించారు.

ifs officers visit miyawaki plantation in karimnagar commisinarate
​ హరితహారంలో ఆ​ కమిషనరేట్​ రాష్ట్రానికే ఆదర్శం​: డోబ్రియల్​

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ హరితహారంలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని ప్రిన్స్​పల్​‌‌ ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్​ఆర్‌ఎం డోబ్రియల్‌ పేర్కొన్నారు. కమిషనరేట్‌ పరిధిలో మియావాకి పద్దతిలో మొక్కలు పెంచుతున్న తీరును అటవీసంరక్షణ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. తక్కువ విస్తీర్ణంలో అత్యధికంగా మొక్కలు పెంచాలన్న ఉద్దేశ్యంతో విదేశాల్లో ఈవిధానం అమల్లో ఉందని ఆయన తెలిపారు.

కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి స్వయంగా ఈవిధానం అమలుపరిచి దాదాపు 14వేలకుపైగా మొక్కలు పెంచుతున్నారన్నారు. కేవలం మొక్కలు పెంచడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. సీపీ సూచనల మేరకు స్థానిక పోలీస్ సిబ్బంది కూడా మొక్కలు పెంచడంలో పూర్తి సహకారాన్నిఅందిస్తున్నారని కొనియాడారు. ఈవిధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతివిభాగం అమలు చేస్తే బాగుంటుందని సూచించారు.

ఇదీ చూడండి: మళ్లీ చిగురిస్తోన్న మహావృక్షం... పిల్లలమర్రికి కొత్త ఊడలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.