ETV Bharat / state

Harish Rao: త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​: హరీశ్​ రావు - తెరాసలో చేరిన విద్యార్థి సంఘాల నాయకులు

తెలంగాణ యువతకు తెరాస భరోసానిస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్​ రావు అన్నారు. హుజూరాబాద్​కు చెందిన విద్యార్థి సంఘాల నేతలను కండువా కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. కొత్తగా 50 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్​ రావు
రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్​ రావు
author img

By

Published : Jul 11, 2021, 7:23 PM IST

కొత్తగా 50 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్ రావు తెలిపారు. యువతకు తెరాస అండగా ఉంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్​లో హుజూరాబాద్​కు చెందిన విద్యార్థిసంఘాల నేతలు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.

టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేర్నాక రమాకాంత్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు అక్కెనపల్లి శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా జాయింట్ సెక్రటరీ రాకేశ్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల అనిల్‌ కుమార్​ను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈటల మంత్రిగా పని చేసిన సమయంలో తమను వేధింపులకు గురి చేశారని విద్యార్థి నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో.. అదే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని హరీశ్ రావు స్పష్టం చేశారు.

త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. కొత్తగా 50 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యార్థి నేతలకు ఆయన సూచించారు. తెలంగాణ యువతకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, తెరాస నేత ఎర్రోళ్ల శ్రీనివాస్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

నిరుద్యోగుల్లో చిగురించిన ఆశలు

ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి పూనుకోవటంతో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా నియామకాల ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఎలాంటి వివాదాలు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. 50 వేల ఉద్యోగాల్లో ఎక్కువగా పోలీసు శాఖ చెందిన ఉద్యోగాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:

Job recruitment: ఉద్యోగాల ఖాళీలపై అధికారులతో హరీశ్ రావు​ భేటీ

HARISH RAO: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ఆర్థికశాఖ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.