కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే సతీశ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మిషన్ భగీరథ నీళ్లు తమ గ్రామాల్లోకి రావడం లేదంటూ పలువురు ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు.
సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని సర్పంచ్లను, ఎంపీటీసీలను ఆయన అభినందించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.