కరోనా సంక్షోభంలో.. మానవతావాదులు పేదల ఆకలి తీరుస్తూ వారి అవసరాలను గుర్తిస్తూ సామాజిక బాధ్యతగా ముందుకు సాగుతున్నారు. కరీంనగర్ బస్టాండ్‌లో గంటల కొద్ది వేచి ఉన్న ప్రయాణికులకు.. స్థానిక స్వచ్ఛ సేవ ఫౌండేషన్ ప్రతినిధులు భోజనాన్ని పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
దూరప్రాంతాలకు వెళ్లనున్న ప్రయాణికులు లాక్డౌన్ కారణంగా.. కరీంనగర్ బస్టాండ్‌కు వరకు వచ్చి ఆగి పోతున్నారు. తిరిగి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు వేచి ఉండాల్సి రావడంతో.. అక్కడే తలదాచుకుంటున్నారు. పరిసర ప్రాంతాల్లో తినడానికి ఏమీ దొరకని పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తున్నారు.
వీరిని చూసి చలించిపోయిన స్థానిక స్వచ్ఛ సేవ పౌండేషన్ వ్యవస్థాపకులు.. భాను, శ్రీనులు వారికి అండగా నిలిచారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీధర్ సాయంతో.. ప్రయాణికులకు భోజనాన్ని అందిస్తున్నారు. మానవతావాదులంతా ముందుకొచ్చి ఆపత్కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: గాంధీభవన్‌లో మూడు ఉచిత అంబులెన్సులు ఏర్పాటు