ETV Bharat / state

Telangana Rains News : వదలని వరుణుడు.. వణికిపోతున్న ఉత్తర తెలంగాణ జిల్లాలు - ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు

Rain Lash In Telangana : భారీ వర్షాలు, వరదలతో ఉత్తర తెలంగాణ జిల్లాలు విలవిల్లాడుతున్నాయి. ఆకాశానికి చిల్లుపడిందా అనే రీతిలో వరుణుడు ప్రతాపం చూపడంతో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాలు ముంపు బారినపడ్డాయి. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు సహా చెరువులు, వాగుల్లో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద తాకిడితో బిక్కుబిక్కుమంటున్నారు. మరో రెండు రోజులు వర్షాలున్నందున యంత్రాంగం అప్రమత్తమైంది. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

RainFall
RainFall
author img

By

Published : Jul 27, 2023, 8:00 PM IST

Updated : Jul 27, 2023, 9:14 PM IST

వదలని వరుణుడు.. వణికిపోతున్న ఉత్తర తెలంగాణ జిల్లాలు

Heavy Rains In North Telangna Districts : భారీ వర్షాలకు ఉత్తర తెలంగాణ జిల్లాలు వణికిపోతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. కుండపోతగా వర్షానికి వాగులు, చెరువుల్లో ప్రవాహ ఉద్ధృతికి చాలా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మోకాల్లోతు వరదలో వెళ్లలేక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి, ఇంధల్వాయి, డిచ్‌పల్లి, మోపాల్, ధర్పల్లి, సిరికొండ ,నిజామాబాద్ గ్రామీణ మండలాల్లో వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రామడుగు ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. సిరికొండకు నాలుగువైపుల నుంచి రాకపోకలు ఆగిపోయాయి. జక్రాన్‌పల్లి పెద్దచెరువు కట్ట ముప్పు పొంచి ఉన్న తరుణంలో గ్రామస్తులు చెరువు అలుగు తొలగించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ నాల ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి, ఎడపల్లి మండలంలోని అలీ సాగర్ జలాశయం రెండుగేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.

భారీ వర్షాలతో పెద్దపల్లి రాజీవ్ రహదారిపైకి భారీగా వరద చేరింది. ముందు జాగ్రత్తగా ఓ వైపు నుంచే వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వరద గుప్పిట్లో చిక్కుకుంది. జవహర్ నగర్‌లో ఇల్లుకూలి.. ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మేడిపల్లి మండలం రాజలింగంపేటకి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. గ్రామ సర్పంచ్ జేసీబీ సాయంతో వాగు దాటించి ఆసుపత్రికి తరలించేలా చొరవ తీసుకున్నారు. గోపాల్‌పూర్‌ ఇసుక క్వారీలో మానేరు వాగు ప్రవాహంలో 12 మంది చిక్కుకుపోగా అధికారులు వారిని రక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వర్షం ధాటికి ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్​టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.

ముంపునకు గురైన ఉమ్మడి కరీంనగర్ : ఎగువ నుంచి వస్తున్న వరదతో సిరిసిల్లలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. వరద కాలువలు, నాలాలు ఆక్రమించడం వల్లే ముంపు బారినపడ్డామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పందివాగు, రామడుగులోని మోతె వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి కరీంనగర్‌ జలమయంగా మారింది. ఎన్టీఆర్​ కూడలి, రామగుండం బైపాస్ రోడ్డు, ఆర్​టీసీ వర్క్‌షాప్‌ వద్ద భారీగా వరద నీరు చేరింది. రేకుర్తిలోని మైనార్టీ గురుకులాన్ని వరద చుట్టుముట్టింది.

Rains In Khammam : ఖమ్మంలో పద్మావతినగర్​లోని మున్నేరు వరదల్లో రెండు కుటుంబాలు చిక్కుకున్నాయి. ఓ ఇంట్లో పసిపాపతో సహా ఏడుగురు ఉండగా.. మరో ఇంట్లో ఐదుగురు చిక్కుకుపోయారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక 4 గంటలుగా నిరీక్షించగా.. వారిని ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది శ్రమించి రక్షించారు. వాగు ఉద్ధృతి వల్ల శిథిలావస్థకు చేరిన కాల్వొడ్డు పాత వంతెనను అధికారులు మూసివేసి వాహనాలను బైపాస్‌ రోడ్‌కు మళ్లించారు. బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెంలో వాగులు, వంకలు పొంగి పొర్లతున్నాయి. భారీ వర్షాలతో పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. 12 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఇళ్లలోకి కిన్నెరసాని వరద చేరడం వల్ల భయంతో కొందరు ఇళ్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.

వరద ఉద్ధృతికి అతలాకుతలం అవుతున్న ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. పొచ్చర జలపాతం పరవళ్లు తొక్కుతోంది. మంచిర్యాల జిల్లా సింగరేణి ఉపరితల గనులలో భారీ వర్షాల వల్ల 40వేల టన్నుల బొగ్గు వెలకితీతకు అంతరాయం ఏర్పడింది. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్ మండలాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు త్రివేణి సంగమం వాగు ఉప్పొంగి సమీప పంట పొలాలను ముంచెత్తింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా పడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తూరు శివారులో దుందుబివాగు ఉద్ధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి జిల్లా వలిగొండ పరిధి మల్లేపల్లి చెరువు కట్ట తెగి నీరంతా పంట చేలను ముంచెత్తింది.

ఇవీ చదవండి :

Last Updated : Jul 27, 2023, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.