ETV Bharat / state

Karimnagar Rains : కరీంనగర్‌ వాసుల వరద కష్టాలు ఎప్పుడు తీరేనో..!

Heavy Rains in Karimnagar : ఎడతెరిపిలేని వర్షాలకు కరీంనగర్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. స్మార్ట్‌సిటీ నిధులతో రోడ్లు నిర్మించినప్పటికి.. చాలా చోట్ల వరద కాల్వల నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. రహదారులపై వరద నీరు చేరి పలు కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏటా వర్షకాలంలో సమస్యలు ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న డ్రెయిన్లు, రోడ్ల మరమ్మతులకు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది.

Karimnagar
Karimnagar
author img

By

Published : Jul 22, 2023, 10:25 AM IST

Updated : Jul 22, 2023, 11:37 AM IST

వర్షాలతో కరీంనగర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయం

Heavy Rains in Karimnagar District : మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్‌లో చాలాచోట్ల వరద పోటెత్తింది. రహదారులు నీట మునిగాయి. వాననీరు లోతట్టు కాలనీల్లో ఇళ్లను ముంచెత్తింది. వావిలాలపల్లి, మంచిర్యాల చౌరస్తా, ఇందిరాచౌక్‌, అశోక్‌నగర్‌, హుస్సేనిపుర, శ్రీనగర్‌కాలనీ, రాంనగర్‌, విద్యానగర్‌, ఆమేర్‌నగర్‌, పాతబజారు, విద్యానగర్‌, కోతిరాంపూర్‌, కట్టరాంపూర్‌తోపాటు విలీన కాలనీల్లోని విలీన కాలనీల్లోని వీధుల్లో మురుగునీటి కాల్వలు పొంగిపొర్లాయి. మోకాల్లోతున చేరిన వరద నీటిలో ఆయా ప్రాంతాల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు.

ముకరంపుర, మంకమ్మతోట రెండో ఠాణా వెనక భాగంలో భారీగా వరద చేరింది. హౌసింగ్‌బోర్డు కాలనీలో పలు ఇళ్లను వరద ముంచెత్తింది. శర్మనగర్‌లో ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతోందని స్థానికులు వాపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా... వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆరోపిస్తున్నారు. అంతర్గత మురుగు కాల్వలను ప్రధాన డ్రైన్‌కు కలపకపోవడం వల్లే అవస్థలు పడుతున్నామని తెలిపారు.

"వర్షం పడితే మురుగు నీరంతా ఇంట్లోకి వస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ పరిస్థితి తప్పదు. కాలనీలోచేరిన వరద వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బయటికి వెళ్లాలంటే భయపడాల్సి పరిస్థితి నెలకొంది. మోకాళ్ల నీరు నిలిచిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఫలితం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం." - స్థానికులు

Heavy Rains in Karimnagar : స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం మేయర్‌, కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లామని త్వరలోనే నిధులు మంజూరైతే పనులు పూర్తిచేస్తామని అంటున్నారు. వర్షాలతో ఎదురయ్యే సమస్యల తక్షణ పరిష్కారానికి నగరపాలక సంస్థ సంసిద్ధంగా ఉందని మేయర్ సునీల్‌రావు స్పష్టం చేశారు.

Rains in Karimnagar District : మరోవైపు కరీంనగర్‌ జిల్లాలో గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కొన్నిచోట్ల కుంభవృష్టి కురిసింది. అత్యధికంగా గుండిలో 21.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద ప్రవాహంతో చెర్లబూత్కూర్‌-ఐత్‌రాజ్‌పల్లి గ్రామాల మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి. నగునూరు-తీగలగుట్టపల్లి పాత రహదారిలోని కల్వర్ట్‌పైనుంచి నీరు ప్రవహించింది. గొట్టపర్తి రాజవీరు, గోపాల్‌పూర్‌లో బెజ్జంకి పుట్టయ్య, చెర్లబూత్కూర్‌లో విజ్జగిరి శంకరయ్య ఇళ్లు నేలమట్టమయ్యాయి.

ఇవీ చదవండి :

Heavy Rains in Hyderabad : నగరంలో పొంగిపొర్లుతున్న నాలాలు.. జలదిగ్బంధంలో పలు కాలనీలు

Hussain Sagar Water Flood : నిండుకుండలా హుస్సేన్​ సాగర్.. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం

Last Updated : Jul 22, 2023, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.