కరోనా సమయంలోనూ నిరంతరం విధులను నిర్వర్తిస్తున్నామని... తమకు మూడేళ్లుగా వేతనాలు ఇవ్వడం లేదంటూ తాత్కాలిక వైద్య సిబ్బంది ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఎదుట బోరునా విలపించారు. న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిని ఎంపీ సందర్శించారు. పలు విభాగాలను పరిశీలిస్తుండగా తిరుమల అనే తాత్కాలిక ఏఏన్‌ఎమ్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది ఆయనను కలిశారు.
ఆస్పత్రిలో పని చేసే ఇతర తాత్కాలిక సిబ్బందికి వేతనాలు ఇస్తున్నారని.. తమకు మాత్రం ఇవ్వడం లేదని చెప్పారు. గతంలో ఆస్పత్రి నిధుల నుంచి జీతాలు ఇచ్చారని, ఆర్డర్ కాపీ వచ్చినప్పటి నుంచి జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని బండి సంజయ్ వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ప్రేమ మైకంలో కూరుకుపోయా.. కట్టుకున్నవాడికే దూరమయ్యా..